Site icon Prime9

CM Ys Jagan : “అమ్మ ఒడి” పథకం నాలుగో విడత నిధులను రిలీజ్ చేస్తున్న సీఎం జగన్..

CM Ys Jagan releasing amma vodi funds in kurupam

CM Ys Jagan releasing amma vodi funds in kurupam

CM Ys Jagan : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ మేరకు 022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’  నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగన్‌. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు.. చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటి వరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర నిధులని రిలీజ్ చేశారు.

Exit mobile version