Site icon Prime9

CM Ys Jagan : వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్‌.. ఎప్పుడంటే ?

cm ys jagan going to inaguarate varikapudisela project in palnadu district

cm ys jagan going to inaguarate varikapudisela project in palnadu district

CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..

ఇక మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం నేడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించింది. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది.

Janasena – Tdp Meeting at vijayawada novatel hotel

ఇక జనసేన కూడా నాలుగైదు ప్రతిపాదనలు ముందుకి తెచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం రెండు పార్టీల నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు.

 

Exit mobile version