Amaravati: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఆర్థికంగా రాష్ట్రం బాగుందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.4శాతం నెరవేర్చామన్నారు.
రాష్ట్ర జీడీపీ గతం కన్నా బాగుందని జగన్ అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏడాదికి అప్పుల పెరుగుదల 17.45 శాతం అన్నారు. ఏడాదికి అప్పుల్లో సగటు పెరుగుదల 12.73శాతం అన్నారు. రాష్ట్రం చేస్తున్న అప్పులు చెల్లించడం కష్టమని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం అప్పుల శాతం పెరిగిందన్నారు. ఇప్పుడు కేంద్రం కన్నా రాష్ట్రం అప్పుల శాతం తగ్గిందన్నారు.