Site icon Prime9

Cm Ys Jagan : జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..

Cm Ys Jagan decision about giving land to journalists in ap

Cm Ys Jagan decision about giving land to journalists in ap

Cm Ys Jagan : ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ అందించింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టున్నారని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్‌ అభినందనలు తెలిపింది.

ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు. దేవాలయాల ఆదాయ పరిమితులు ఆధారంగా కేటగిరీల్లో మార్పులకు చేసేందుకు అనుమతినిచ్చింది.  అలాగే టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏ కు కూడా ఏపీ కేబినేట్ ఆమోద ముద్ర వేసిందని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ – 2023 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.

 

 

Exit mobile version