Site icon Prime9

CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

cm jagan

cm jagan

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు (నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ను సీఎం జగన్ రేపు ప్రారంభిస్తారు. గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో జగన్ పాల్గొంటారు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు రెండు జిల్లాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 11వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ వివరాలను వెల్లడించారు. అరండల్ పేట వైపు నుంచి మార్కెట్, బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు, ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ నుంచి నాజ్ సెంటర్ మీదుగా, కృష్ణ మహల్ రోడ్డు నుంచి జిన్నా టవర్ మీదుగా బస్టాండ్ వెనుక వైపు మళ్లిస్తారు.

 

Exit mobile version