Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణ, చికిత్సల పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ సూచించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు, భోధనాసుపత్రుల్లో నాలుగు లైనాక్ మెషిన్ల ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల్లోనూ అత్యాధునిక క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.