Site icon Prime9

Kuppam YSRCP: కుప్పం వైసీపీలో భగ్గుమన్న విభేధాలు

kuppam-ycp

kuppam: చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌పై మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి మారణాయుధాలతో దాడికి దిగాడు. ఈ ఘటనలో మురుగేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో వైపు మున్సిపల్ ఛైర్మన్ పీఎ రాముపై కూడా దాడి జరిగింది.

ఓ ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలను బయటకు రానివ్వకుండా వైసీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version