CID : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన నిందితుడు – సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అని

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 06:55 PM IST

CID : ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అని సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్ అన్నారు. స్కిల్‌ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో రూ.550 కోట్ల స్కాం జరిగింది అన్నారు. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం జరిగిందని.. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్నారు. ఫండ్స్ ఏమయ్యాయి అన్నది తేలాల్సి ఉందని.. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసన్నారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని.. ఈడీ, జీఎస్టీ కూడా దీనిపై దర్యాప్తు చేశాయన్నారు. ఈ విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్ధిదారుడిగా తేలిందని.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామన్నారు.

నిధులు మళ్లింపుపై చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందని.. ఈ స్కామ్‌కు సంబంధించి డాక్యుమెంట్లు కూడా మాయం చేశారన్నారు. ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును అరెస్ట్ చేశామన్నారు. ఈ స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి లోకేష్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉందన్నారు. లోకేష్, కిలారు రాజేష్ పాత్రపై విచారణ చేయాల్సి ఉందని.. లోకేష్ పాత్ర ఏపీ డెవలెప్‌మెంట్‌‌లోనే కాకుండా ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు డైవర్షన్ కేసుల్లో కూడా ఉందని.. దీనిపైనా సీరియస్‌గా విచారణ జరుగుతోందన్నారు.

 

 

ముఖ్యమైన పత్రాల మాయం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉందన్నారు. టీడీపీ హయాంలో కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని సంజయ్ తెలిపారు. ఘంటా సుబ్బారావు ఎంఏఈ, సీఈవోగా వ్యవహరించారని.. ఉద్దేశపూర్వకంగా సుబ్బారావుకు నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన‌ కార్పొరేషన్ ఎండీగా, సిఈవోగా, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా నియమించారన్నారు. రూ.58 కోట్ల సాఫ్ట్‌వేర్‌ని రూ.మూడు వేల‌కోట్ల ప్రాజెక్ట్‌గా చూపించారన్నారు. కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్‌కి చెందిన మనోజ్ విదేశాలకు పారిపోయారు అన్నారు. చంద్రబాబు‌ పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయారన్నారు. ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించారో సీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు. విదేశాలకి పారిపోయిన కీలక‌ నిందితుల‌ కోసం ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామని స్పష్టం చేశారు.