Site icon Prime9

Chintamaneni Prabhakar: చింతమనేనిని అడ్డుకొన్న పోలీసులు

Chintamaneni was stopped by the police

Chintamaneni was stopped by the police

Gudivada: గుడివాడ మీదుగా సాగుతున్న అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఆధ్యంతం పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైకోర్టు నిబంధనల మేరకు చేపడుతున్న పాదయాత్రలో రైతులతో పాటు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వచ్చిన వారిని సైతం గుడివాడ పోలీసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలోనే రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులకు అనుమతి లేదంటూ అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

భీమవరంలో జరుగనున్న పార్టీ సమావేశానికి వెళ్లుతుండగా అడ్డుకోవడం ఏంటని చింతమనేని పోలీసులు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే ఎట్టకేలకు పోలీసుల వలయం నుండి ఛేధించుకొని బైకుపై పాదయాత్రకు చేరుకొన్న చింతమనేనిని చూసి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయన పై పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని రైతుల పాదయాత్రను అడ్డుకొంటామని పేర్కొన్న సమయంలో వారికి అండగా ఉండేందుకు తెదెపాకు చెందిన కీలక నేతలు గుడివాడకు చేరుకొన్నారు. వీరిలో మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా ఉన్నారు. ఒక దశలో కొడాలి కటౌట్ కు మాంగటి చెప్పు తీసి చూపించడంతో వాతావరణం వేడెక్కింది. రైతులను చూసి కొడాలి నాని వర్గీయులు సైతం హేళన చేయడంతో ఆ సమయంలో అక్కడి పరిస్ధితి ఒక్కసారిగా హైటెన్షన్ కు దారితీసింది.

ఇటు అధికార పక్షం, అటు ఉద్యమం నడుమ ఏం చేయాలి అన్న మీమాంసలో పోలీసులు ఉండిపోయారు. చివరకు అంతా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. ఇదంతా అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాల పై అమరావతి పాదయాత్ర విషయంలో కాలు దువ్వేలా మాట్లాడడమే ప్రధానంగా చెప్పవచ్చు. ఎలా వస్తారో చూస్తామంటూ పరుష వ్యాఖ్యాలే నేటి తెదేపా కీలక నేతలు గుడివాడ పాదయాత్రలో పాల్గొనేందుకు దారితీసిందని చెప్పవచ్చు.

 

Exit mobile version