Site icon Prime9

Mukesh Kumar Meena: ఏపీలో 10.52లక్షల ఓట్లు ఏరివేత.. చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా

Chief Electroal Officer Mukesh Kumar Meena claimed that 10.52 lakh votes were deleted in Andhra Pradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబర్ 9 నాటికి నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన 10,52,326 ఓట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా తొలగించిన్నట్లు సీఈవో వెల్లడించారు. దీంతో గతేడాది ఓట్లతో పోలిస్తే ఈసారి 8,82,366 ఓటర్లు తగ్గారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,,54,093 ఉండగా, పురుష ఓటర్లు 1,97,15,614 ఉండగా మహిళా ఓటర్లు 2,01,34,621 ఉండారన్నారు. సర్వీసు ఓటర్లు 68,115, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 3858 మందికి ఉన్నట్లు తెలిపారు. 18-19 వయస్సు గల్గిన వారి ఓటర్ల సంఖ్య 78,438 ఉండగా ఏ ఓటరు కార్డు కోసం ఆధార్ ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 60శాతం మంది ఓటర్లు ఆధార్ తో అనుసంధానం చేసుకొన్నారని ఆయన అన్నారు.

ఏ ఎన్నికకు సంబంధించినదైనా ఓటరు నమోదుకు వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోద ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. 19న విచారణ చేపడుతున్నట్లు సీఈవో పేర్కొన్నారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులు పై చర్యలు తప్పవన్నారు. ఎన్నికల సంఘం ఈసారి నిరాశ్రయులకు ఓటరు కార్డులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Cheating: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

Exit mobile version