Site icon Prime9

TDP: వెంకన్న బ్రహ్మోత్సవాలా? జగనోత్సవాలా?

Venkanna Brahmotsavala..Jaganotsavala

Venkanna Brahmotsavala..Jaganotsavala

Tirupati: తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు.

వాస్తవానికి, ఏపీలో ఫ్లెక్సీలు నిషేదం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వుంది. తాజాగా ఎవరైనా ప్రింట్ చేసినా ఫ్లెక్సీలతో ప్రచారం చేసినా అడుగుకు వంద రూపాయల లెక్కన జరిమానా అంటూ ప్రభుత్వం ప్రకటించింది. పెనాల్టీలను మాత్రం నవంబర్ 1 వ తేదీ నుండి వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ శాఖలు ప్రకటించాయి.

ఈ క్రమంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. శ్రీవారికి పట్టు వస్త్రాలను అందచేసేందుకు సీఎం తిరుపతికి వస్తుండడంతో వైకాపా నేతలు వెంకన్న స్వామిని మరిచిపోయారు. తిరుపతి పట్టణాన్ని జగన్ ఫ్లెక్సీలతో నింపివేసారు. తిరుపతిని ఫ్లెక్సీల నగరంగా తీర్చిదిద్దుతామని గతంలో పాలకులు ప్రకటనలకు నేటి తీరుకు ఎక్కడా పొంతన లేదంటూ పట్టణ తెదేపా నేతలు నిరసనలకు దిగారు.

వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలను పక్కన బెట్టీ అధికారులు, నేతలు సీఎం జగన్ భజన చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏంటని నేతలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం లక్షలాది మంది ప్రజల సమక్షంలో సీఎం జగన్ ప్రతిష్టను మరింత పెంచడం కోసమే బ్రహ్మోత్సవాలు అనుకొనే రీతిలో వైకాపా ప్రవర్తిస్తుండడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.

ఇది కూడా చదవండి:  రాష్ట్రం బొత్స జాగీరు కాదు.. అచ్చెన్నాయుడు

Exit mobile version