Site icon Prime9

Kakani Govardhan Reddy : చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎనిమిది నిండుప్రాణలు బలిగొంది.. వైసీపీ ఫైర్

kakani

kakani

Kakani Govardhan Reddy : టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు బలిగొందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. కేవలం డ్రోన్ విజువల్స్ కోసం ఇరుకుసందుల్లో సభలు నిర్వహిస్తున్నారని వారు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ప్రమాదం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరఘాట్ లో 29 మంది మృతికి కారణమయ్యారన్నారని ఆయన అన్నారు.

ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో సభ నిర్వహించారు చంద్రబాబు. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారు. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ట్వీట్ చేసారు. సభకు ఎక్కువ మంది వచ్చారని డ్రోన్ కెమెరా షాట్ల ద్వారా చూపించడానికి కందుకూరు సభలో అందరినీ ఒకేవైపు నిలబెట్టారు టీడీపీ నాయకులు. ఫలితంగా తోపులాట జరిగి 8 మంది మృతిచెందారు. చంద్రబాబు&కో కి అమాయకుల ప్రాణాల కన్నా పబ్లిసిటీనే ముఖ్యమా? ” మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ట్వీట్ చేసారు.

వాస్తవానికి టీడీపీ కందుకూరు ఇన్ చార్జ్ అక్కడ కాల్వ ఉంది జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించినా పట్టించుకోని కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ కొందరు కాల్వలో పడ్డారు.మురుగు కాల్వలో కొంతమంది పడిన వెంటనే అక్కడున్నవారు అలర్ట్ అయ్యారు. ఆపై అందరూ అటువైపు నుంచి పక్కకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రమాద స్థాయి పెరిగింది. తొక్కిసలాటలో కొందరు స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar