Site icon Prime9

Chandrababu Naidu: అరాచక శక్తిగా జగన్.. దాన్ని తుద ముట్టించే శక్తిగా నేను

chandrababu

Chittoor: చిత్తూరు జిల్లా పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నువ్వు అరాచక శక్తి ఐతే దాన్ని తుదముట్టించే శక్తి నాదని చంద్రబాబు ఢీ అంటే ఢీ అన్న రీతిలో మాట్లాడారు. శాసనసభా సాక్షిగా సీఎం జగన్ తప్పులు, అబద్దాలను ఆడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. రాష్ట్రంలో 10శాతం మంది పోలీసులు హక్కులను కాలరాస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. వారిని వదిలి పెట్టేది లేదని కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తల పై కేసులు మీదు కేసులు పెడుతూ ఎప్పుడూ పోలీసు స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కని వారిని సైతం ఇబ్బందులు పెట్టడం పై, అన్నీ గుర్తు పెట్టుకొంటున్నాని బాబు పేర్కొన్నారు. పోలీసులు ఎక్కడ నుండో ఊడి పడలేదు. ప్రజలు కట్టే పన్నులతో వారికి జీతాలు ఇస్తున్నాము. లా అండ్ ఆర్డర్ కాపోడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడ ఉందని గుర్తుంచుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఒంగోలుకు వస్తే టిడిపి కార్యకర్తల పై బైండోవర్ కేసులు పెట్టడం, తన 14 ఏళ్ల సీఎం చరిత్రలో చూడలేదని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంభాషణ పై బాబు స్పందించారు. అధికార పీఠమెక్కిన ఇన్ని ఏళ్లకు గుర్తుకువచ్చిందా, వారికి ఏదో ఒక వ్యవహారం ఉండాలంటూ అంటూ ఎద్దేవా చేశారు. లేనివి సృష్టిస్తూ మాజీ ముఖ్యమంత్రి పై  అభాండాలు వేయాలనుకోవడం ఓ మూర్ఖత్వంగా పేర్కొన్నారు. పోలీసింగ్ పేరుతో ఎన్ని అవరోధాలు సృష్టించినా వెనుకడుగు వేసేది లేదని బాబు కరుగ్గానే అన్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులకు హెచ్చరించారు. జరుగుతున్న అన్యాయాల పై వీరోచితంగా పోరాడిన కార్యకర్తలను గౌరవంగా ఊరేగించే రోజులు ఎంతో దూరంలేవన్న బాబు మరో సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తెదేపాదే గెలుపు అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

హంద్రీ నీవా నీరు వస్తున్నాయా అని జిల్లా ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ది ఆగిందన్నారు. ఇంటి నిర్మాణాలు, ఔటర్ రింగు రోడ్డు పనులు అటకెక్కడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర హీనుల్ని చరిత్రే అడ్డుకొంటుందని జగన్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 175 సీట్లు అంటున్నారు, పులివెందులలో సీటు గెలుస్తావో లేదో చూసుకో అంటూ జగన్ కు బాబు సవాల్ ఇసిరారు. బాబాయ్ ను చంపానని ఓటు అడుగుతారా? కోడికత్తి వ్యవహారం నడిపానని అడుగుతావా? అంటూ హేళనగా మాట్లాడారు.

5వేలకు పైగా కేసులను అన్యాయంగా టిడిపి కార్యకర్తల పై పెట్టారని ప్రభుత్వం పై విరుచుక పడ్డారు. జగన్ ఏ లగ్నాన పుట్టాడో కాని నోరు తెరిస్తే తప్పులు, అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరం పై అబద్దాలు, అమరావతి పై అబద్దాలతో రాష్ట్రంలో అభివృద్ది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పౌరహక్కులను కాలరాస్తూ పోలీసింగ్ ప్రభుత్వంగా నడుపుతూ టెర్రరిస్టుల కంటే ఘోరంగా పాలన చేస్తున్నారని బాబు పేర్కొన్నారు. ఖబడ్డార్ అంటూ వారంతా కోర్టు బోను ఎక్కక తప్పదని మరోమారు హెచ్చరించారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు ప్రజల్లో, కార్యకర్తల్లో నూతనోత్సాహం కదం తొక్కింది.

Exit mobile version