Amaravati: పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి నారాయణ స్వామి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ ఏడాది జూన్ రెండవ తేదీనాటికి ఎనిమిదేళ్ళు దాటిందన్నారు. విభజన చట్టం ప్రకారం, అంతా అనుకున్నట్టుగా సవ్యంగా జరిగివుంటే రాజధాని అంటూ లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈపాటికే నూతన రాజధాని ఏర్పాటు చేసుకొని ఉండేదని వ్యాఖ్యానించారు. అభివృద్ది, పాలన నల్లేరుమీద బండిలాగా పరుగులు తీస్తూవుండేదన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం తీవ్ర సంక్షోభంలోనూ, రాజకీయ న్యాయపరమైన వివాదాల్లోనూ మునిగిపోయిందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు నిజమనే చెప్పాలి. ఎందుకంటే నాడు అమరావతికి జై కొట్టిన జగన్, సీఎం కుర్చీ ఎక్కిన అనంతరం యు టర్న్ తీసుకొన్నారు. దీంతో వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరింది. విలువైన కాలం హారతి కర్పూరంలా కరిగిన అనంతరం కోర్టు కూడా జగన్ కు అక్షింతలు వేసే దిశగా వాదనలు జరిగాయి. దీన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటున్నామని కోర్టుకు న్యాయవాదులు చెప్పేసారు. అభివృద్ది వెంటనే చేపట్టాలని సూచించిన హైకోర్టు మాటలను తిరిగి జగన్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేకపోయింది. ఇప్పటికి 6 నెలలు కూడా దాటింది. సరికదా తిరిగి మూడు ముక్కలాట పేరుతో తిరిగి రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండాలంటూ కొత్త పల్లవిని ప్రభుత్వం ఎత్తుకొనడం పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తర్వలో తెలియనుంది. మరోవైపు పార్ట్ 2 పేరుతో అమరావతి రైతులు అరసువల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టి రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ ఉండడం యావత్తు తెలుగునాట పెద్ద చర్చగా జగన్ వ్యవహారం మారింది.