Site icon Prime9

Viveka murder case: గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీం కోర్టును కోరిన సీబిఐ

Cancel Gangireddy's bail...CBI has asked the Supreme Court

Cancel Gangireddy's bail...CBI has asked the Supreme Court

New Delhi: ఏపి సిఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రతిపక్షాలు, అప్రూవర్ పేర్కొన్న ఆరోపణలు నిజమనేలా సీబీఐ అధికారులు కోర్టు మెట్లెక్కారు. కేసులో ప్రధాన నిందుతుల్లో ఒకరైన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సాక్షులను రక్షించుకోవాలంటే బెయిల్ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరింది. నిందుతులు, పోలీసులు కుమ్ముక్కై విచారణ జాప్యానికి ప్లాన్ వేసారని సీబీఐ వాదనలు వినిపించింది. దీన్ని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం, నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును వచ్చే నెల 14కు వాయిదా వేసింది.

వివేకా హత్య పై వైఎస్ కుటుంబీకులు తొలి నుండి అనుమానాస్పదంగానే ప్రవర్తించారు. తొలుత గుండెనొప్పిగా చిత్రీకరించారు. అనంతరం హత్యగా పేర్కొన్నారు. అది కూడా నాటి ప్రభుత్వ పెద్దలే హత్య చేశారంటూ కొత్త నాటకానికి అప్పట్లో తెరతీశారు. అనంతరం ఏపీలో అధికారం మారింది. వైఎస్ కుటుంబీకులు ఎవరైతే ఆరోపణలు గుప్పించారో వారే వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. దీంతో హతుడు వివేకా కుమార్తె రంగంలోకి దిగడంతో కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయి.

ప్రధాన నిందితుల్లో ఒకరైన డ్రైవర్ దస్తగిరి అఫ్రూవర్ గా మారి వివేకా హత్యపై పీఠముడి విప్పాడు. కేసు విచారణలో గంగిరెడ్డితో పాటు దస్తగిరి కూడా బెయిలు పై బయటకొచ్చారు. కాగా, కేసును ముందుకు సాగనీకుండా సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏపీ సీఎం జగన్ పై ప్రతిపక్ష పార్టీలు పలు ఆరోపణలు సంధించాయి. పోలీసులు, ప్రభుత్వ తీరు సరిగాలేనందున కేసును తెలంగాణకు బదిలీ చేయాలంటూ గత నెలలో వివేక కుమార్తె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే బెయిల్ పై ఉన్న అఫ్రూవర్ దస్తగిరి పలు పర్యాయాలు తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పోలీసులకు, ప్రభుత్వానికి విన్నపం చేసుకొన్నా వారిలో మార్పు లేదు. ఈ పరిణామాల నేపధ్యంలోనే బెయిల్ పై ఉన్న గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఏపీ ప్రభుత్వం, కావాలనే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తుందని ఇట్టే తెలిసిపోతుంది.

ఇది కూడా చదవండి:Viveka Murder Case: కుట్ర జరుగుతోంది.. కాపాడండి.. మరోమారు ఎస్పీ దగ్గరకు దస్తగిరి

Exit mobile version