CAG: రాష్ట్రంలో రుణ విస్ఫోటం తప్పదా.. కాగ్ నివేదిక ఏమంటుంది?

CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. జీతాలకే డబ్బులు లేని పరిస్థితుల్లో వేల కోట్లు అప్పులు చేసి నగదు బదిలీ పథకాలకు ఖర్చు చేస్తున్నారని. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

కాగ్ ఏమంటుంది.. (CAG)

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. జీతాలకే డబ్బులు లేని పరిస్థితుల్లో వేల కోట్లు అప్పులు చేసి నగదు బదిలీ పథకాలకు ఖర్చు చేస్తున్నారని. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో ఏపీ పరిస్థితిపై కాగ్ స్పందించింది.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణిస్తే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది. రానున్న సంవత్సరాల్లో రుణాలను భరించే సామర్థ్యం ఉండే అవకాశం లేదు అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎండగట్టింది. రాష్ట్ర (జీఎస్‌డీపీ) రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ద్వారా తీసుకున్న రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్‌డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నా నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో రుణాల శాతం 42.33గా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనంగా ఉంది’ అని కాగ్‌ స్పష్టీకరించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే.. చేసిన అప్పులను తీర్చుకునేందుకు రాబడి పెంచుకోవాలి. అలా జరగని పక్షంలో.. అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం..
2021-22 నుంచి ప్రారంభిస్తే 2030-31నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,47,944.64 కోట్లు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు.. వ్యయాలు వేరేలా ఉన్నాయి.
2024-25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.42,362.20 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.

అప్పుల వలయంలో చిక్కుకునే ప్రమాదం..!

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు.. అభివృద్ధి కోసం ఉపయోగించడం లేదని కాగ్ తెలుపుతోంది.

2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది.

దీంతో కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు.

ఈ కారణంగా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి, ప్రభుత్వ రుణం భరించలేనిదిగా మారుతుంది.

దీంతో రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేము అని కాగ్‌ హెచ్చరించింది.

అభివృద్ధి పనులపై వ్యయం తక్కువే!

రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే మూలధన వ్యయం వాటా తక్కువగా ఉంటోంది.

సాధారణంగా అన్ని రాష్ట్రాలు తమ మొత్తం వ్యయంలో సగటున 14.41శాతం అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్‌ మాత్రం మూలధన వ్యయం(అభివృద్ధి పనులు) కోసం 9.21శాతమే ఖర్చు చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది.

ఇది రాష్ట్రంలో భౌతిక ఆస్తుల కల్పనను ప్రభావితం చేస్తూ దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్‌ నివేదిక పేర్కొంది.