Site icon Prime9

AP Assembly: పెగాసస్‌ స్పైవేర్‌.. చంద్రబాబు హయాంలో డేటా చోరీ జరిగిందన్న సభా సంఘం

katunakar Reddy

katunakar Reddy

Amaravati: చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్‌ ట్యాపింగ్‌ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది. సోమవారం సమావేశమై, మధ్యంతర నివేదికను సమర్పించింది. సమాచారం బయటకు వెళ్లింది కానీ, ఎవరికి వెళ్లిందో తేల్చకపోయింది. 85 పేజీలతో నివేదికను ఇవాళ శాసనసభకు హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి అసెంబ్లీకి నివేదికను సమర్పించారు.

స్టేట్ డేటా సెంటర్ నుండి గుర్తు తెలియని సర్వర్లకు వెళ్లిన ఐపీ వివరాల కోసం ఏపీ హౌస్ కమిటీ గూగుల్ కు లేఖ రాసింది. అయితే ఈ ఐపీ అడ్రస్ లను గుర్తించలేమని కూడ గూగుల్ సంస్థ హౌస్ కమిటీకి తెలిపింది. ఏయే సర్వర్ల నుండి డేటా చౌర్యం జరిగిందనే విషయమై హౌస్ కమిటీ ఈ నివేదికలో వివరాలను పొందుపర్చింది. 2018 నవంబర్ నుండి 2019 మార్చి 31 వరకు డేటా చౌర్యం జరిగిందని హౌస్ కమిటీ తేల్చి చెప్పింది. స్టేట్ డేటా సెంటర్ లాగ్స్ ను కూడ హౌస్ కమిటీ పరిశీలించింది. ప్రజా సాధికారిక సర్వే, స్టేట్ డేటా సెంటర్ కు చెందిన 264 సర్వర్లలో 18 సర్వర్ల ద్వారా డేటా లీకైందని హౌస్ కమిటీ గుర్తించింది. ఈ 18 సర్వర్ల నుండి 24.3 టెరా బైట్స్ డేటా బదిలీ అయిందని హౌస్ కమిటీ తన నివేదికలో వివరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెగాసెస్ సాప్ట్ వేర్ ను కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించారన్న వార్తా కధానలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. డేటా చౌర్యం జరిగిందని పలువురు వైసీపీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై సభాసంఘం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఈ ఏడాది మార్చి 25న హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ హౌస్ కమిటీకి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా కొనసాగుతున్నారు.

Exit mobile version
Skip to toolbar