Bee Attack: తేనెటీగల దాడి.. ఒకరి మృతి

పొలం కూలీలపై తేనిటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొనింది.

Amaravati: పొలం కూలీల పై తేనిటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొనింది. సమాచారంమేరకు, తాడిమళ్ల గ్రామ సమీపంలోని ఓ అరటితోటకు కొంతమంది కూలీలు కోత పనిచేసేందుకు వెళ్లారు. అరటిగేలలను కోస్తుండగా తేనెటీగలు మూకుమ్మడిగా వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో వాహనం డ్రైవర్ షేక్ వలి మృతి చెందాడు. పలువురికి గాయాలైనాయి. కొందరు తేనెటీగల దాడి నుండి తప్పించుకొని పారిపోయారు. గాయపడ్డవారిని స్థానికులు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందచేస్తున్నారు.

రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమె దహన సంస్కారాల కోసం వెళ్లిన బృందం పై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు(62) అనే వృద్ధుడు ఆయాసంతో వచ్చిన గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. ఆ ఘటనలో కూడా 12 మందికి గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: Vishnuvardhan Reddy: పెట్రోల్ బంకు పక్కనే….టపాసులు అమ్మేందుకు ఎలా అనుమతి ఇచ్చారు…ప్రశ్నించిన భాజపా నేత విష్ణువర్దన రెడ్డి