Site icon Prime9

JC Prabhakar Reddy: బీకేర్ ఫుల్.. జిల్లా కలెక్టర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

jc-prabhakar-reddy

jc-prabhakar-reddy

Andhra Pradesh: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి. అనంతపురం జిల్లా కలెక్టర్‌ పై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్ నాగలక్ష్మీ పై విమర్శలు చేశారు. కలెక్టర్ ముందు పేపర్లు విసిరేశారు. బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. స్పందన కార్యక్రమంలో సమస్య పై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్పందన ఎందుకు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్ గా పనికిరావు అంటూ వ్యాఖ్యానించారు.

తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో రూ.70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాచేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై 2021 జనవరిలో కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఎమ్మెల్యే భూఅక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఒక్కరోజులో సమస్యను పరిష్కరించారని, తన ఫిర్యాదు పై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ భూ వ్యవహారంలో కలెక్టర్ కు ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి పోతుంటే ప్రశ్నించకూడదా? అంటూ ఆయన మండిపడ్డారు.

Exit mobile version