Site icon Prime9

Ramachandra Yadav : సీఎం జగన్‌ పై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేసిన రామచంద్ర యాదవ్‌..

bcy chief Ramachandra Yadav complaint on ap cm ys jagan

bcy chief Ramachandra Yadav complaint on ap cm ys jagan

Ramachandra Yadav : వైఎస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ సవాల్‌ చేశారు. సీఎం జగన్‌ అక్రమాస్తులు, అవినీతిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేశారు. సీఎం జగన్‌ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ రామచంద్ర యాదవ్‌ ఆరోపించారు. దీనిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పులివెందుల ఎస్సై ఉసేన్‌ను కోరారు. సీఎం జగన్‌ పై సొంత నియోజకవర్గంలోనే ఫిర్యాదు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

జగన్‌ అవినీతి చేయలేదని ప్రమాణం చేస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామచంద్ర యాదవ్ ఛాలెంజ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు కూడా తాను సిద్ధంగానే ఉన్నానన్నారు. వైఎస్‌ జగన్‌కు భయపడి సొంత చెల్లి, తల్లి కూడా పక్క రాష్ట్రంలో తల దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి గానీ, రాష్ట్రానికి గానీ చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో వైఎస్‌ జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. మద్యం, ఇసుక, నీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు లక్షా 65వేల కోట్ల రూపాయల మేర దోపిడీ చేశారని విమర్శించారు.

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రూ.9 వేల కోట్లు.. మద్యం ద్వారా 50వేల కోట్లు, గ్రానైట్‌లో 30వేల కోట్లు, ఇసుక ద్వారా 12వేల కోట్లు, పారిశ్రామిక, చుక్కల భూముల ద్వారా 20 వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా రూ.15 వేల కోట్లు, విద్యుత్‌ ఒప్పందాలు, కొనుగోళ్లతో రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్‌. ఇక… పోర్టులు, అమూల్‌, బైజూస్‌ నుంచి కమీషన్లు, సినిమా, ఇతర పరిశ్రమల నుంచి వాటాలు.. మొత్తంగా లక్షా 65 వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు.

Exit mobile version
Skip to toolbar