Site icon Prime9

Bandla Ganesh : పవన్ గురించి తెలిసి తెలియకుండా అబాండాలు వేయొద్దని సీఎం జగన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్..

bandla ganesh video about pawan kalyan goes viral on media

bandla ganesh video about pawan kalyan goes viral on media

Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే పలు వేదికలపై భాహాటంగానే పవన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీ సీఎం జగన్ నిన్న సామర్లకోటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పవన్ పెళ్ళిళ్ళపై మళ్ళీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వీటిపై జనసేన నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కూడా సీఎం జగన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలిసి తెలియకుండా అబాండాలు వేయొద్దని.. పెళ్లి విషయం కాకుండా ఆయనను విమర్శించడానికి మరే విషయం లేదని.. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని కొనియాడారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా బ్రతుకు ఎందుకా అని నెక్స్ట్ లెవెల్ లో సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు వేస్తోంది.. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతిన మాట్లాడారు.. అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు.. భగవంతుడు మీకు గొప్ప హోదాను ఇచ్చారు.. నేను దశాబ్దాలుగా ఆయన వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు.. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతివంతుడు.. ఎవరు కష్టంలో ఉన్నా.. అది నా కష్టం అని భావించే భోళా మనిషి..

జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి..అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను.. అదొక్కటే కారణం ఉంది కదా? అదే పదే పదే మాట్లాడటం బాధగా ఉంది.. పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. నిస్వార్థంగా ఉంటాడు.. స్వలాభం కోసం ఏ పని చేయడు.. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ సూపర్ స్టార్‌లా బతకండని నేను చెబుతుండేవాడ్ని. కానీ జనాల కోసం ఏదో ఒకటి చేయాలని వచ్చారు.. అన్నీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం బతుకుతున్నాడు.. రాత్రిపగలు కష్టపడి.. సంపాదించిన డబ్బుని పార్టీకి, ప్రజలకు పెడుతున్నాడు..

ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే ముందుకు వస్తాడు.. ఆయనకు కులాభిమానం లేదు.. దేశ ప్రజలంతా ఒక్కటే అని భావిస్తారు.. కులపిచ్చి ఉంటే నన్ను ఇలా ఆదరిస్తాడా? నన్ను పైకి రానిస్తాడా? నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా ఆయన పెట్టిన భిక్షే.. ఆయన మంచి వ్యక్తి.. నిజాయితీ పరుడు.. తెలిసీ తెలియకుండా అబాండాలు వేయకండి.. నేను జన సేన మనిషిని, కార్యకర్తని కాదు.. ఆయన నిర్మాతని, ఆయన్ను ప్రేమించే వ్యక్తిని’ అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Exit mobile version