Balineni Srinivasa Reddy: వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం.. తాడేపల్లికి రావాలంటూ హై కమాండ్ పిలిచిన ఆయన పెద్దగా స్పందించలేదు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఆయన.. నేడు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
సీఎం జగన్ తో భేటీ.. (Balineni Srinivasa Reddy)
వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం.. తాడేపల్లికి రావాలంటూ హై కమాండ్ పిలిచిన ఆయన పెద్దగా స్పందించలేదు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఆయన.. నేడు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
మెున్నటివరకు బాలినేని.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. ఉన్నఫలంగా ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాల వల్లే ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి కూడా త్వరలోనే బాలినేని రాజీనామా చేయనున్నట్లు వార్తలు రావడంతో.. తాడేపల్లి కార్యాలయానికి జగన్ పిలుపించుకున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం జగన్ తో బాలినేని సమావేశమయ్యారు.
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో తన అసంతృప్తికి గల కారణాలను బాలినేని.. సీఎం జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే అంశంపైనా సీఎం జగన్‌కు పలు ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం.
బాలినేని వ్యవహారం పట్ల.. ఇది వరకే వైసీపీ నేతలు జగన్ కు ఫిర్యాదు చేశారు. వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆయనపై విమర్శలు వచ్చాయి.
అయితే ఈ విమర్శలపై జగన్ కు బాలినేని వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం బాలినేని రాజీనామాతో పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైకాపా అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బాలినేనిని బుజ్జగించి తిరిగి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం.
పదవుల రాజీనామా విషయంలో జగన్ బుజ్జగించినట్లు సమాచారం. అయినా కూడా బాలినేని మెత్తబడలేదని తెలుస్తోంది.
దీంతో పార్టీ పదవికి బాలినేని చేసిన రాజీనామా ఉపసంహరణ విషయంపై ఇంకా సందిగ్ధత తొలగలేదు.
సీఎం జగన్‌తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాస్ మీడియా కంట పడకుండా మరో దారిలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.