NTR Jayanthi: సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. ఆయన శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
బాలకృష్ణ నివాళులు..
సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. ఆయన శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతంర.. బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు వారిని ప్రపంచాలని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఈ రోజును తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా.. రాజకీయంలోను చెరగని ముద్రవేశారని ప్రశంసించారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ తెదేపా ను స్థాపించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారింది. మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా అని బాలకృష్ణ అన్నారు.