Prime9

Ayyannapatrudu: ఆంధ్ర యూనివర్శిటీని బ్రోతల్ హౌస్ గా మార్చారు.. అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh: చంద్రబాబు అభివృద్ధి చేయలేదు సరే, అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ఏం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. హుదూద్ తుపాను సమయంలో చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారని చెప్పారు. వైసీపీ నేతలు ఆంధ్ర యూనివర్శిటీని బ్రోతల్ హౌస్ గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీ వీసీ ఛాంబర్ ను వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేశారని అయ్యన్న మండిపడ్డారు.

ఏ2 విజయసాయిరెడ్డి రూ. 10 వేల కోట్ల ఆస్తులను దోచుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా విజయసాయి ఉన్నప్పుడు ఎంత దోచుకున్నారో చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఇలాంటి దోపిడీదారులా మాకు నీతులు చెప్పేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రం దెబ్బతింటోందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు.

Exit mobile version
Skip to toolbar