Site icon Prime9

Ayyanna Patrudu: ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోంది.. అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu

Ayyannapatrudu

Amaravati: ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తన కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడం పై స్పందించిన అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా సీఐడీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రశ్నిస్తే ఇంతటి కక్షసాధింపు చర్యలా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇంట్లో యజమానులు లేని సమయంలో ఆడవాళ్లను, చిన్న పిల్లలను బెదిరిస్తారా అని నిలదీశారు. సీఎం జగన్‍ పై జనమే తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో పోలీసు వ్యవ‌స్థను జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం వినియోగిస్తున్నార‌ని ఆయ‌న ధ్వజ‌మెత్తారు. ఏపీ సీఎం జగన్ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? ఏపీ సీఐడీ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెడతారా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తాము ఎప్పుడూ తప్పు చేయలేదని, ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేవాళ్లం కాదన్నారు. ఏం తప్పు చేశామని తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎంత బెదిరించినా తాము వెనక్కి తగ్గే వాళ్లం కాదని పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన ఇంటి గోడను పడగొట్టారని అయ్యన్న పేర్కొన్నారు.

Exit mobile version