Site icon Prime9

Nellore: ఎంపీడీవోకి దేహశుద్ధి.. అసలేం జరిగిందంటే..!

Attack on mpdo in nellore

Attack on mpdo in nellore

Attack On MPDO In Nellore: ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పై దాడి జరిగింది. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే అయ్యగారి బాగోతం బయటపడింది. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పనిచేస్తున్న రఫీఖాన్ గత రెండేళ్లుగా ఓ పంచాయతీలో పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. తనతో ఉండాలని తన కోరిక తీర్చాలంటూ ఆ మహిళను నానా రకాలుగా వేధించడంతో ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవో పై దాడి చేశారు. అడ్డువచ్చిన ఉద్యోగులందరినీ కొట్టారు. మహిళల పై వేధింపులకు పాల్పడుతున్న ఇలాంటి ఉద్యోగులను సస్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

 

Exit mobile version