Site icon Prime9

Aarogyasri Cards: ఏపీలో అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు

Arogyashri

Arogyashri

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు గుడ్ న్యూస్. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. శాలరీ సర్టిఫికెట్ ఆధారంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండి ఇంకా ఆరోగ్యశ్రీ కార్డులు అందరి అర్చకుల కోసం ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు దేవాదాయ శాఖ కమిషనర్. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని అర్చకులు కూడా సద్వినియోగం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు .

Exit mobile version