Site icon Prime9

Araku Mp Goddeti Madhavi: కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

Araku-Mp-Goddeti-Madhavi

New Delhi: కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్ దండేకు స్థానం కల్పించారు. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాఫీ బోర్డును పునర్ నియమిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్ కూడా కాఫీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఇన్ స్టాంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో విశ్వనాథం (విశాఖ జిల్లా దోమంగి), కురుసా ఉమామహేశ్వరరావు (కొత్తపాడేరు), జయతు ప్రభాకర్ రావు (విశాఖ జిల్లా కిన్నెర్ల), చల్లా శ్రీశాంత్ (హైదరాబాద్) సభ్యులుగా నియమితులయ్యారు.

Exit mobile version