Site icon Prime9

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

ap-tet

Amaravati: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఏపీ విద్యాశాఖ. ఈ ఏడాది టెట్‌కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. టెట్ ఫలితాలను సెప్టెంబర్ 14న విడుదల చేయవలసి ఉంది. కానీ కొన్నికారణాల వలన ఆలస్యమయింది.

Exit mobile version
Skip to toolbar