Site icon Prime9

AP Police: జనసేన ఆవిర్భావ సభ.. పోలీసుల ఆంక్షలు

AP Police

AP Police

AP Police: ఏపీలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుపడుతోంది. తాజాగా ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ర్యాలీలు, సభలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌-30 అమల్లో ఉందని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 

మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ(AP Police)

మరోవైపు మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున వస్తారని ఆయన తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా గెలవలేక అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలని వైఎస్సార్సీపీ నేతలు చూస్తున్నారని, వారి ఆగడాలకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు.

జనసేన ఆవిర్భావ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బిజీబిజీగా ఉన్నారు.

ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేనాని వ్యూహాలు రచిస్తోంది.

దీనికి తోడు మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పొత్తు ఖాయం అనే ప్రచారం సాగుతోంది.

ఈసారి తెలుగుదేశం పార్టీ తో పొత్తులతో ఎన్నికలకు వెళ్లి అధికార వైసీపీని ఓడించాలని భావిస్తున్నారు.

పవన్ ను సీఎం చేసి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాని కాపు సంఘం నేత హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యాయి.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ జనసేనాని తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

ఈ క్రమంలో రేపు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయినా జనసేన తమ సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు.

ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటినుంచే బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మచిలీ పట్నం సభ ద్వారా రాబోయే ఎన్నికలకు పవన్ శంఖారావం పూరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అలాగే వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు.

గతంలో ఇప్పటం సభకు ఇచ్చినట్టే 100 ఎకరాల భూమిని సభ నిర్వహణ కోసం మచిలీపట్నం రైతులు ఇచ్చారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జనసేనాని కోరారు.

 

వారాహిలో మచిలీపట్నానికి..

జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్లనున్నారు.

పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగింది. జనసేన పార్టీలో ప్రజలు క్రియాశీల సభ్యత్వాలను తీసుకున్నారు.

సభకు తరలివచ్చే శ్రేణులు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి మొత్తం 10 కమిటీలను వేసి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు సభకు తరలి వెళ్లనున్నారని తెలుస్తోంది.

 

చివరి దశలో ఏర్పాట్లు : నాదెండ్ల

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మహనోహర్‌ అభినందించారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జనసేన జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ 10వ ఆవిర్భావ సభకు జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు

 

Exit mobile version