Site icon Prime9

Nara Lokesh : స్కిల్ స్కామ్ లో నారా లోకేష్ కు ఏపీ హైకోర్టు లో ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ !

ap high court oreder about not arrest nara lokesh until october 4

ap high court oreder about not arrest nara lokesh until october 4

Nara Lokesh : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ (Nara Lokesh) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ లో ఈ కేసులకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ ప్రారంభం కాగానే మధ్యంతర బెయిల్ కావాలని లోకేష్ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడని ఏజీ శ్రీరాం హైకోర్టులో వాదించారు. ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్దిపొందారని ఏజీ ఆరోపించారు. ఈ విషయమై కోర్టులో ఆధారాలు అందించామన్నారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీన పూర్తిస్థాయిలో వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. అలానే ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

కానీ అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో మాత్రాం ఆయనకు ఊరట లభించలేదు. ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచించింది. 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. దీంతో ఢిల్లీలో ఉన్న సీఐడీ బృందం లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేరుస్తూ.. గత వారంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ (Nara Lokesh) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకే సంబంధం లేదని కేవలం రాజకీయ కారణాలతోనే తన పేరును ఇరికించారని ఆరోపించారు.

ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్‌ పేరును మెన్షన్‌ చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ముందస్తు బెయిల్ పొందారు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో ఇవాళ జరగనుంది.

Exit mobile version