Site icon Prime9

Cm Ys Jagan : సీఎం జగన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు.. మరో 40 మందికి కూడా

Cm Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. మరోవైపు పిటిషన్‌ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

అయితే, ఈ పిల్ లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ పిటిషన్ వేశారంటూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత ఉన్న పిటిషన్ కాదని కోర్టుకు విన్నవించారు. రఘురామ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ క్లయింటు పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని న్యాయస్థానానికి వివరించారు.

Exit mobile version
Skip to toolbar