Site icon Prime9

AP Government: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. డిజిటల్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్

digital payments

digital payments

Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు. నవంబర్ 21 నుంచి నగదు చెల్లింపులతో పాటు కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు అనుమతించనున్నారు.

మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయానికి స్ధానికంగా షాపుల్లో ఉండే సిబ్బంది చేతివాటాలతో గండి పడుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల్ని పోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో వైపు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయడం లేదని విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల్ని రద్దు చేసి వాటిని తమ అధీనంలోనికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఏపీలో ప్రస్తుతం లభిస్తున్న మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకనివి, నాసిరకమైనవి. వీటిని ప్రజలపై రుద్దడం ద్వారా మద్యనిషేధం దిశగా అడుగులేస్తున్నట్లు ప్రభుత్వం గతంలో ఘనంగా చెప్పుకుంది. కానీ మారిన పరిస్దితుల్లో ఈ నాసిరకం బ్రాండ్లే గతి కావడంతో మందుబాబులు కూడా వీటినే అలవాటు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితం అందుకుంది. నాసిరకం బ్రాండ్లు కూడా భారీ ధరలకు అమ్ముతుండటంతో వాటినే అలవాటుపడుతున్న మందుబాబులు వాటి కోసం భారీ మొత్తాల్ని వెచ్చించి మరీ కొంటున్నారు.

Exit mobile version