Site icon Prime9

Chandra Babu Naidu : చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కారు.. కరకట్టపై గెస్ట్ హౌస్ అటాచ్

ap government big shock to chandra babu naidu over karakatta guest house

ap government big shock to chandra babu naidu over karakatta guest house

Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. విజయవాడలోని కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్ ని అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సదరు గెస్ట్ హౌస్ విషయంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. ఆ మేరకు స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్ చేసింది.

ఇక, సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్‌మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి అందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని ఆరోపించింది.

ఈ క్రమంలోనే చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం నిబంధనల మేరకు చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేసినట్టుగా తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Exit mobile version