Site icon Prime9

Amaravati Farmers padayatra: అమరావతి మహా పాదయాత్రకు షాకిచ్చిన డిజిపి

Dgp Rajendranath order

Dgp Rajendranath order

Andhra Pradesh: పూజ్య బాపూజీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడవగలిగే స్వాతంత్య్రమే నా ఆకాంక్ష అన్న మాటలు. అర్ధరాత్రి ఆర్డర్స్ కు పోలికెక్కడో తెలియటం లేదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోొ సాక్షాత్తు ప్రధాని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వేలాది మంది రైతాంగం, అశేష ప్రజానీకం నడుమ నాడు అట్టహాసంగా తీసుకొచ్చిన అమరావతి రాజధానిని అటకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో నేటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును ఒప్పుకొనేది లేదంటూ రెండో దఫా చేపట్టనున్న అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆంధ్రప్రదేశ్ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలను పరిశీలించి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అమరావతినే రాజధాని గా ఉంచాలంటూ, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ గత ఏడాది అమరావతి నుండి వెంకన్న చెంతకు పేరుతో తిరుమల రాజధాని అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. మహా పాదయాత్రకు ప్రతిపక్ష పార్టీలతోపాటుగా ప్రజల నుండి కూడా భారీగానే మద్దతు రావడంతో పలు పాంత్రాల్లో నెలకొన్న ఉధ్రిక్తతలతో 71 క్రిమినల్ కేసులను పాదయాత్ర చేపట్టిన జిల్లాల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి శాంతి భధ్రతలకకు విఘాతం కల్గించన అంశాలుగా పేర్కొన్నారు.

తాజాగా సెప్టెంబర్ 12 నుండి అమరవతి నుండి అరసవల్లి వరకు పాదయాత్రకు రైతులు అనుమతి కోరిన నేపధ్యంలో పోలీసులు తిరస్కరించారు. తొలుత 200 మందితో పాదయాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పాదయాత్రలో మరింత మంది చేరితే ఒక్కొక్క గ్రూపుగా విభజించి 200 మించకుండా పాదయాత్రను చేపట్టేలా ప్రతిపాదనను పోలీసులు ఒప్పుకోలేదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను నాటి పాదయాత్రలో పాటించలేదన్నారు. షరత్తులు ఉల్లగించిన క్రమంలో పాదయాత్రకు పోలీసులు షాకిచ్చారు.

రాష్ట్ర  ప్రభుత్వం పేర్కొన్న మూడు రాజధానుల పై ప్రజల ఆకాంక్షలు మెండుగా ఉండడంతో శాంతి భధ్రతల విషయంలో విఘాతం కలుగవచ్చన్న ముందస్తు ఆలోచనతోనే పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు పేర్కొన్నారు.

దీంతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న మాటలను పోలీసులే స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఇటీ వల కోనసీమ జిల్లా పేరు విషయంలో రెండు వర్గాల్లో చేపట్టిన ర్యాలీలో శాసనసభ్యులు, మంత్రి ఇంటిని తగల బెట్టిన ఘటన గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా రెండు ప్రధాన రాజకీయ పార్టీల నడుమ తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకొంటుందని డిజిపి ఆర్డర్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

పాదయాత్ర సాగే జిల్లాల్లో ఆ ప్రాంతం కూడా ఉండడంతో చిన్న పాటి సమస్య కూడ పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నట్లు పోలీసు ఆర్డర్ లో పేర్కొన్నారు. సున్నితమైన ఈ అంశాల నేపధ్యంలో ప్రజా ప్రయోజనాలమేరకు అమరవతి రైతులు చేపట్టిన మహాపాద యాత్రకు అనుమతి లేదంటూ డిజిపి ఆర్డర్ వేశారు. దీనిపై మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ రైతులు కోర్టుమెట్లు ఎక్కనున్నారు.

Exit mobile version