Site icon Prime9

Deputy cm Narayana swamy: బాధితునికి న్యాయం జరిగేలా చూసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ap-deputy-cm-narayana-swamy-helps-pawan-kalyan-fan

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నందుకు ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎంకు తన బాధను చెప్పుకున్నారు. అక్కడ ఉన్న నాయకులు వెంటనే స్పదించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బుక్కాపట్నంలో జరిగింది. గడపగడప కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఊర్లోకి వచ్చారు.

ఇంటికి వచ్చిన రాజకీయ నాయకులకు, డిప్యూటీ సీఎంకు జరిగినదంతా చెప్పుకొచ్చారు. గతాడేది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఆయన ఫ్లెక్సీ ఇంటికి పెట్టుకున్నందుకు తన ఇళ్ళ పట్టా తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చారని, ఇదేమైనా న్యాయమా అంటూ డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. ఫ్లెక్సీ పెట్టక ముందు నా పేరు వచ్చిందని, తరువాత పేరు రాలేదని చెప్తున్నారు. భాదితుడుకు ఇళ్ళ పట్టా వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ళ పట్టాలను అందించిన డిప్యూటీ సీఎంకు భాదితుడు ధన్యవాదాలు తెలిపాడు.

Exit mobile version