Site icon Prime9

CM Ys Jagan In Gudivada : గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. లైవ్

ap CM Ys Jagan In Gudivada to start tidko houses

ap CM Ys Jagan In Gudivada to start tidko houses

CM Ys Jagan In Gudivada : ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడివాడ శివారులోని మ‌ల్లాయ‌పాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జ‌గ‌న్ ప్రారంభించి ల‌బ్దిదారుల‌కు అందించారు. ఈ మేరకు 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా రూపుదిద్దారు. కాగా ఇందులో తొలి విడతలో 3, 296 ఇళ్లు నిర్మాణం కాగా రెండో విడతలో 5,616 ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటిలో 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్లు ఉన్నాయి. కాగా ఈ క్రమం లోనే టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం ‌జగన్..  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..

 

Exit mobile version