Site icon Prime9

Ap Cm Ys Jagan : వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేసిన ఏపీ సీఎం జగన్.. వైభవంగా “వాలంటీర్ల సేవా పురస్కారం” కార్యక్రమం

ap cm ys jagan appreciates volunteers in out state

ap cm ys jagan appreciates volunteers in out state

Ap Cm Ys Jagan : అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించగా.. ఈ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. వాలంటీర్లు ఒక సైనం.. కానీ చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ల వ్యవస్థ అంటూ వారి సేవలను కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫించన్ ఇచ్చారా ? అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు.

తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ – సీఎం జగన్ (Ap Cm Ys Jagan)

గతంలో జన్మభూమి కమిటీ అరాచకాలు, వివక్ష, లంచాల ద్వారానే పథకాల అమలు అయ్యేవని సీఎం జగన్‌ విమర్శించారు. తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని ప్రశంసించిన ఆయన.. ప్రభుత్వం చేసిన పని ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. పేదల ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారని మండిపడ్డారు. సేవ చేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. కేవలం సేవ చేయాలని తపన ఉన్న వారే ఈ వాలంటీర్లు అని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar