Site icon Prime9

Thammineni Sitharam : బ్లాక్ కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని..

ap assembly speaker thammineni sitharam shocking comments on

ap assembly speaker thammineni sitharam shocking comments on

Thammineni Sitharam : ఏపీ సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై.. తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా..? అంటూ ప్రశ్నించారు.

ఎవరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను తొలగించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కేంద్రానికి సిఫార్సు చేస్తానన్నారు. బ్లాక్ కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అని హెచ్చరించారు తమ్మినేని సీతారాం. దేశంలో ఎంతో మందికి బెదిరింపులు ఉన్నాయని.. అందరికీ బ్లాక్ కమాండోస్ ను ఇస్తారా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలకు అతీతుడా? అని తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే చంద్రబాబు విలవిల కొట్టుకుంటాడు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు స్పీకర్ తమ్మినేని.

చంద్రబాబు మహానాడులో లేనిపోనీ హామీలు గుప్పించి మరో సారి ప్రజలకు మోసాం చేసేందుకు సిద్ధ పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి వెన్నుపోటు పొడిచారన్నారు. ఆరోజు చంద్రబాబు నాయుడు మాయలో తానూ పడ్డానని, దీంట్లో నేను భాగస్వామినని వ్యాఖ్యనించారు. అధికారంలో ఉండేటపుడు హామీలను నేరవేర్చడంలో విఫలమైన బాబును ప్రజలు గద్దె దించాశారని తెలుసుకోవాలన్నారు. సీఎం జగన్ మేనిపేస్టోనే కాదు అందులో ఇవ్వని హామీలు నెరవేర్చి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

అదే విధంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం జగన్ మేనిఫెస్టోను దైవంగా భావిస్తారని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికే 98.7 శాతం అమలు చేశారని చెప్పారు. హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం సీఎం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని, పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షల ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు – నేడు,విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. కులం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇళ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. త్వానికి అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. చాలా మంది నేతలకు హెచ్చరికలు ఉన్నాయని అయినా ఈయనకే ఎందుకు జడ్ ప్లస్ కేటగిరిని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో చెప్పాలన్నారు. హెచ్చరికలు ఉన్న నేతలందరికి సెక్యూటరీ ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించాలని స్పీకర్ కోరారు.

 

Exit mobile version