AP Assembly Day 2 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా ఈ క్రమం లోనే ఈరోజు కూడా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతాారాం ప్రకటించారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సభ ప్రారంభం అయ్యింది.
AP Assembly Day 2 : రెండో రోజు రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు.. లైవ్

AP Assembly Day 2 sessions live