Supreme Court: జగన్ కు సుప్రీంలో మరో ఎదురు దెబ్బ

ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు ఆగడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిపాలన అంశాలపై ఇప్పటికే ఏపి సీఎం జగన్ కు సుప్రీం కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసింది. తాజాగా పోలవరం ప్రాజెక్టుపై సర్వోత్తమ న్యాయస్ధానంలో ఏపి ప్రభుత్వానికి షాక్ తగిలింది

New Delhi: ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు ఆగడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిపాలన అంశాలపై ఇప్పటికే ఏపి సీఎం జగన్ కు సుప్రీం కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసింది. తాజాగా పోలవరం ప్రాజెక్టుపై సర్వోత్తమ న్యాయస్ధానంలో ఏపి ప్రభుత్వానికి షాక్ తగిలింది.

పర్యావరణానికి కల్గిన నష్టం పై ఎందుకు బాధ్యత తీసుకోరని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ ఉల్లంఘనలకు రూ. 120కోట్ల రూపాయలు రుసుము కింద చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కేసుకు సంబంధించి మరిన్ని అంశాలను ప్రస్తావించింది.

న్యాయవాదులకు ఫీజులు చెల్లిస్తున్న ఏపి ప్రభుత్వం, పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని నిలదీసింది. పోలవరం ప్రాజక్ట్ కేసులో ఇప్పటివరకు ఎంత నగదు న్యాయవాదుల కొరకు ఖర్చు పెట్టారనే దానిపై నోటీసు ఇస్తామని ధర్మాసనం పేర్కొనింది. ఒక్క కేసులో ఎంతమంది సీనియర్ న్యాయవాదులను తీసుకొస్తారని ప్రశ్నించింది. ఇప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాభై వేల మంది ముంపుకు గురైన్నట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు అన్ని విన్న తర్వాత పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులపై ఎన్జీటి ఇచ్చిన తీర్పు పై దాఖలు చేసిన అప్పీళ్లను అన్ని కలిపి వాదనలు వింటామని సుప్రీం కోర్టు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ అనంత బాస్కర్ కు హైకోర్టులో చుక్కెదురు