Ap Rains: అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఎండాకాలంలో కూడా.. వానాకాల పరిస్థితులను తలపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
మూడు రోజులపాటు వర్షాలు..
అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఎండాకాలంలో కూడా.. వానాకాల పరిస్థితులను తలపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
రానున్న మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లు విస్తారంగా.. వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారి.. సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.
ఏపీలో మంగళవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో పాటు.. వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. పార్వతీపురం , అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.