Rajamahendravaram: అమరావతి నుండి అరసవళ్లి వరకు తలపెట్టిన అమరాతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం నాటి నుండి వైకాపా శ్రేణులు పదే పదే వారిని రెచ్చగొడుతున్నారు. విధ్వంసానికి కవ్విస్తున్నారు. నేడు రాజమహేంద్రవరంలో పాదయాత్ర చేస్తున్న రైతులపై నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు నానా యాగీ చేశారు.
ఆ సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పొడుతున్న వ్యక్తులను అడ్డుకోవాల్సిన పోలీసులు చోధ్యం చూశారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల జేఏపి ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాళ్లు వేసినా, బాంబాలు వేసిన పాదయాత్ర ఆపేది లేదని, అరసవళ్లిలోని సూర్య భగవానుడి దర్శనం తర్వాతే మా తిరుగు ప్రయాణం అని వారు స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం పాదయాత్ర చేస్తున్నామన్నారు. వైకాపా గూండాలా లేదా మీరు పోలీసులా అని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వారిని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతివక్కరికి హక్కు ఉందన్నారు. మీ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు పాదయాత్ర రైతులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. నేడు జరిగిన ఘటనపై ఖచ్ఛితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లతామన్నారు. స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ప్రైవేటు కేసులు వేస్తామన్నారు.
నేడు జరిగిన ఘటన ఓ సిగ్గులేని చర్యగా పేర్కొన్నారు. పేటీఎం బ్యాచులతో సీఎం జగన్ గేం ఆడిస్తున్నారని రైతుల జేఏసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా 200మందికి పైగా మాపై దాడి చేసి, మేము చేశామని మీడియాలో వార్తలు రావడం బాధాకరమన్నారు. మహిళల పై దాడులు చేయడం ఎంతవరకు సబబని ఆవేదన చెందారు. మానవత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైకాపా శ్రేణులకు లేదా అని వారు కుండ బద్ధలు కొట్టిన్నట్లు మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలు మాత్రం మాకు అండగా నిలబడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి:Nallari Kishore Kumar Reddy: కాలయాపనకే మూడు రాజధానులు.. తిరుపతిని రాజధాని చెయ్యాలనిపించలేదా?