Site icon Prime9

Rape Case : మతి స్థిమితం లేని దళిత యువతిపై ఆరుగురు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

6 members rape on unsound mind girl at ntr district

6 members rape on unsound mind girl at ntr district

Rape Case : సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతుండడం శోచనీయం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు.. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మతి స్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై ఆరుగురు అత్యాచారం చేసిన గర్భవతిని చేశారు. ఆ విషయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం జరుగుతుండగా రీసెంట్ గానే సదరు యువతి గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లాలోని ముష్టికుంట గ్రామంలో ఓ యువతి నివసిస్తుంది. ఆమె మానసిక రోగి. కాగా ఆమె తల్లి మూతి చెందగా.. తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో ఆమె బాగోగులు చూసేవారు లేకుండాపోయారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆమెపై కన్నేసి ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా కొన్ని నెలలుగా ఆమెపై ఈ మృగాలు అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నారు. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది.

కానీ పలువురు పెద్ద మనుషులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు.. ఆ దుర్మార్గులను కాపాడేందుకు ఆర్ధిక సాయం ఇస్తామని ఎవరు లేని ఆ అభాగ్యురాలికి వెల కట్టారు. అలానే గుట్టుగా అబార్షన్ కూడా చేయించారు. అయితే పెద్దల పంచాయితీతో న్యాయం జరగలేదని భావించిన బాధిత యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో తిరువూరు పోలీసులు ఆత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మతిస్థిమితం లేని దళిత యువతిపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని.. ప్రభుత్వం తరపున సాయం అందేవిధంగా చూడాలని పలువురు నేతలు కోరుతున్నారు.

Exit mobile version