Janasena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 08:52 PM IST

Janasena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపై తన పోరాటమని అన్నారు. జనసేనకు ఛానెళ్లు, టీవీలు, డబ్బులు లేవు.. జనం తప్ప. ధైర్యం ఉంటేనే పోరాటం చేయగలం.నా గుండెల్లో బలం ఉంది, పోరాట పటిమ ఉంది, జనసైనికులున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జగ్గు గ్యాంగ్‌ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు..(Janasena chief Pawan Kalyan)

వాలంటీర్ల వ్యవస్థ అసలు అవసరమే లేదన్న పవన్ ఒక యువకుడి కష్టం తాలూకు ఖరీదు రూ.164.30 పైసలా? యువతలో ప్రతిభను వెలికితీయకుండా..160 రూపాయలకు పనిచేయించుకుంటారా? ఇంకా ఎంతకాలం పేదవారిని పట్టిపీడిస్తారు అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు మహిళలంటే గౌరవం లేదన్నారు. నా భార్య, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోను.
నేను ధైర్యవంతుడుని, ఎవరికీ భయపడను. జగన్ ఒక రౌడీ పిల్లవాడు. జగ్గు భాయ్, జగ్గు గ్యాంగ్‌ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. జగ్గు భాయ్, జగ్గు గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో జనసేనకు తెలుసు.
నా పోరాటం జగన్‌పై కాదు.. సమస్యలపై అని పవన్ స్పష్టం చేసారు. జనసేన వచ్చాక పెండింగ్‌లో ఉన్న సుగాలి ప్రీతిలాంటి కేసుల సంగతి తేలుస్తామని అన్నారు.
జగన్‌పై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయనని ఏది ఉన్నా మేమే చూసుకుంటామని అన్నారు.

పేర్నినానిపై సెటైర్లు..

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై సెటైర్లు వేసారు. అన్నవరంలో పోయిన తన చెప్పులు మచిలీపట్నంలో కనిపించాయని అన్నారు. గతంలో అత్తారింటికి దారేది సినిమా పైరసీ కూడా మచిలీపట్నంలోనే వచ్చింది.చెప్పులు, అత్తారింటికి దారేది సినిమా పైరసీ రెండూ మచిలీపట్నంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇది ఆలోచించాలి.రెండింటికి కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదని పవన్ సెటైర్లు వేసారు.