Site icon Prime9

Nandyala: అల్లుఅర్జున్ పర్యటన వివాదం.. ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు

Nandyala

Nandyala

Nandyala:ఏపీలో ఎన్నికల ముగిసినప్పటికీ దానికి సంబంధించిన ఘటనలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి . ఒక వైపు అల్లర్లు కేసులు ,మరో వైపు ప్రముఖలు పర్యటనలో అలసత్వం చూపించినందుకు పోలీసులపై చర్యలు కొనసాగుతున్నాయి . నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి నైతిక మద్దతు తెలపడంకోసం సినీ స్టార్ అల్లుఅర్జున్ నంద్యాల రావడం తెలిసిందే . అల్లుఅర్జున్ ను చూడడానికి జనం బాగా గుమిగూడారు . భారీగా ర్యాలీతో స్వాగతం పలికారు . ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ తీయడంపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం దీని పై సీరియస్ అయింది. ఈ పర్యటన వల్ల పోలీసులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అల్లు అర్జున్‌ పర్యటన వివాదం కు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్‌, నాగరాజు ను వీఆర్‌ కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని ముందుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.

ఈసీ నోటీసులు జారీ..(Nandyala)

ఈ సంఘటన పై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్ అయ్యింది. అనుమతి లేకుండా జనాలు అధిక సంఖ్యలో శిల్పా రవి ఇంటికి చేరుకోవడంతో స్థానిక నేతలు వారందరిని తీసుకుని వచ్చినట్లు ఆరోపిస్తూ స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar