Site icon Prime9

Jagan vs Adnan Sami: అద్నాన్ సమీ vs వైసీపీ మంత్రులు.. తెలుగు జెండా వివాదం ఏంటి?

adnan sami vs jagan

adnan sami vs jagan

Jagan vs Adnan Sami: ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..ఆర్ఆర్ఆర్ టీం ను చూసి గర్వపడుతున్నాం. అంటూ సీఎం జగన్ రెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ పై ఫేమస్ సింగర్ అద్నాన్ సమీ కాస్త ఘాటుగా స్పందించారు.

దీనిపై అద్నాన్ సమీ ఏమన్నారంటే ముందుగా మనం భారతీయులమని.. అది గుర్తుంచుకోవాలని జగన్ ట్వీట్ కు అద్నాన్ సమీ సమాధానం ఇచ్చారు. తెలుగు జెండాకు ముందు…భారత జెండా కదా అని సూచించారు. తెలుగుకు ముందు మనం భారతీయులం. దేశం నుంచి వేరుచేయడం ఆపండి అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. మనది ఒకే దేశమని.. వేర్పాటువాదం మంచిది కాదని సూచించారు. 1947లో ఏం జరిగిందో మనం చూశాం కదా అని.. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు.

మంత్రుల రీ కౌంటర్స్..

ఇక సమీ ట్వీట్ పై వైసీపీ మంత్రులు.. కార్యకర్తలు మండిపడ్డారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ “మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు మాకు గర్వకారణం. నేను మళ్లీ చెబుతున్నాను, మేం తెలుగు వాళ్లం. మా దేశభక్తిని ప్రశ్నించడానికి మీరు ఎవరు.? తెలుగులో ఉన్న నా గౌరవం ఒక భారతీయుడిగా నా గుర్తింపును తీసుకుపోదు” అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక ఇదే విషయంపై మరో మంత్రి విడదల రజని సైతం అద్నాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఒకరి సొంత గుర్తింపులో గర్వపడటం వారి దేశ భక్తిని తగ్గిచందు. ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటు వాదాన్ని ప్రకటించడం కాదు. రెండింటినీ కన్ఫ్యూజ్‌ చేయకూడదు. ట్విట్టర్‌లో అతిగా ఆలోచించడం కంటే ఇండియాకు మరో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించడంలో కృషి చేస్తే బాగుంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

లండన్ లో పుట్టి పెరిగిన సమీకి పాకిస్థాన్ పౌరసత్వం ఉంది.. కానీ ఆయన ఇండియన్ గా స్థిరపడ్డారు. ఇక్కడే ఉండిపోయిన అద్నాన్ కు ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. సమీ తల్లిది కశ్మీర్ కాగా.. ఇండియాపై ఆయన అత్యంత భక్తి ప్రదర్శిస్తారు.

ఇవి కూడా చదవండి…

థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version