ACB Raids: హైదరాబాద్లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణ రావడంతో.. అశోక్ నగర్లోని అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
రియల్టర్ మర్డర్ కేసులో సస్పెన్షన్..(ACB Raids)
ఉమామహేశ్వరరావు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ కేసులోనూ డబ్బులు తీసుకున్నారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరరావును అప్పటి సీపీ సస్పెండ్ చేశారు.