Site icon Prime9

నల్గొండ: ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లి మృతిచెందిన నల్గొండ జిల్లా వాసి

Ramsethu

Ramsethu

Nalgonda: ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి (32) మృతిచెందాడు. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో అస్వస్థతకు గురైన ఆయన కన్నుమూశారు. ఈ నెల 3న నేపాల్ వెళ్లి అక్కడి నుంచి 4,900 మీటర్ల ఎత్తులో ఉన్న లోబుచే పర్వతాన్ని చేరుకున్నాడు. వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక గుండెపోటుకు వచ్చింది. అతికష్టమ్మీద అతడిని లాడ్జికి తీసుకొచ్చారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై లాడ్జి సిబ్బంది ఈనెల 22వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

రాజశేఖర్ రెడ్డి ఐదేండ్ల క్రితం జూబ్లీహిల్స్లో సాఫ్ట్ వేర్ ఫారెన్సెస్ సైంటిస్ట్ కంపెనీని స్నేహితులతో ప్రారంభించాడు. హైదరాబాద్ లోనే ఫ్యామిలీతో స్థిరపడ్డారు. విగతజీవిగా మారిన కొడుకుని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Exit mobile version