Site icon Prime9

Pastor: చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ సమాధి సిద్దం చేసుకున్న పాస్టర్

Pastor in Krishna District

Krishna District: కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ వింత చేష్టలు చర్చనీయాంశమయ్యాయి. తాను 10 రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మళ్లీ మూడో నాడు తిరిగి లేచొస్తానని చెప్పడం స్థానికంగా కలకలం రేపింది. గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన పాస్టర్ పులపాక నాగభూషణం చనిపోయినా తిరిగొస్తానంటూ స్థానికం ప్రచారం చేశారు. సియోను బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ పేరిట స్థానికంగా చర్చి నిర్వహిస్తున్న ఆయన.. చనిపోయి మూడు రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్థులతో చెప్పాడని స్థానికులు చెబుతున్నారు. నాగభూషణం తన సమాధికి స్థలం కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ విషయం తెలియడంతో స్థానికులు అవాక్కయ్యారు. పాస్టర్ గురించి సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు పూర్తి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. చనిపోయిన మనిషి తిరిగి ఎలా వస్తారంటూ చర్చించుకుంటున్నారు. పాస్టర్ నాగభూషణంకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది. నాగభూషణం వింత ప్రవర్తన స్థానికంగా చర్చనీయాంశమైంది. నాగభూషణం ఏకంగా తాను చనిపోతున్నానంటూ ఫ్లెక్సీ కూడా ఒకటి పెట్టించుకున్నాడు. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకున్నాడు..

తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని అందరికీ చెప్పాడు. పాస్టర్ వింత చేష్టలతో కుటుంబసభ్యులతో పాటూ స్థానికులు కంగారుపడ్డారు. చనిపోయిన మనిషి ఎలా తిరగొస్తాడని ప్రశ్నిస్తున్నారు.. పాస్టర్ కు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. టెక్నాలజీలో దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం వీడటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Exit mobile version